- Advertisement -
ఖాట్మాండ్: నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌కు అస్వస్థతకు గురయ్యారు. రామ్‌చంద్ర పౌడెల్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. రామ్‌చంద్ర ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో పాటు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్నాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అస్వస్థతకు గురికాగానే వెంటనే ఖాట్మాండూలోని బైకుంతా తాపాలియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు. నేపాల్ ప్రధాన మంత్రి పుష్ఫాకమల్ దాహల్ ఆస్పత్రికి చేరుకొని అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. వారం రోజుల క్రితం ఆయనకు కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Also Read: అన్నదమ్ముల కథ.. ఎవరు హీరో.. ఎవరు విలన్?
- Advertisement -