మైసూరు: సీనియర్ కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బుధవారం వరుణలో నామినేషన్ దాఖలు చేశారు. మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుణ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత అయిన సిద్ధరామయ్య నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రి హెచ్‌సి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కాగా సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య వరుణ సిట్టింగ్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎగా ఉన్నారు. 75ఏళ్ల సిద్ధరామయ్య ఎనిమిదిసార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. వరుణ నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. 2008లో వరుణ నియోజకవర్గంలో గెలిచిన ఆయన ఎదిగారు.
Also Read: కర్ణాటకలో బీజేపీ యువమోర్చా నేత హత్య..
అనంతరం 2013అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. కాగా నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన తన సొంతగ్రామం వారి కులదైవం సిద్ధరామేశ్వర దేవాలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం రామాలయాన్ని సందర్శించి భారీ రోడ్‌షో నిర్వహించారు. మైసూరులోని ప్రఖ్యాత చాముండేశ్వరి దేవాలయాన్ని సందర్శించారు. మరోవైపు అధికార బిజెపి తమ అభ్యర్థిగా మంత్రి వి సోమన్నను సిద్ధరామయ్యకు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపింది.