Monday, December 23, 2024

రెండో రోజు విచారణకు హాజరైన అవినాశ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వివేకా హత్య కేసులో రెండో రోజు ఎంపి అవినాశ్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్‌ను సిబిఐ వేర్వేరుగా ప్రశ్నిస్తోంది. భాస్కర్ రెడ్డి అనారోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక గదిలో విచారణ చేస్తున్నారు. వివేకా కేసులో అవినాశ్‌ను ఇప్పటికే సిబిఐ ఐదు సార్లు ప్రశ్నించింది. గురువారం జయప్రకాశ్ రెడ్డి కూడా సిబిఐ విచారణకు హాజరవుతాడని సమాచారం.  వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండర్‌గా జయ ప్రకాశ్ రెడ్డి పని చేస్తున్నారు.

Also Read: తెలంగాణ ప్రజలను కించపరచవద్దు: పవన్

వివేకా మత్య జరిగాక మృతదేహానికి ప్రకాశ్ రెడ్డి కుట్లు వేసి డ్రెస్సింగ్ చేశారు. తెలంగాణ హైకోర్టులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. ఎలాంటి సంబంధం లేదని తమను సిబిఐ అరెస్ట్ చేసిందని పిటిషన్ వేశారు. తన అనారోగ్యం దృష్టా బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి కోరారు. వివేకాను తామే హత్య చేశామనడానికి సిబిఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్ వేశారు. గూగుల్ టేకౌట్ లోకేషన్ ఆధారంగా అరెస్ట్ చేయడం సరైందని కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News