Monday, December 23, 2024

జింకను ఢీకొట్టిన వందేభారత్ రైలు… వ్యక్తిపై జింక పడడంతో

- Advertisement -
- Advertisement -

జైపూర్: వందేభారత్ రైలు ఢిల్లీ నుంచి అజ్మేరుకు వెళ్తుండగా జింకను ఢీకొట్టడంతో ఓ వ్యక్తిపై పడింది. సదరు వ్యక్తి, జింక మృతి చెందిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలో జరిగింది. రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… వందే భారత్ రైలు ఢిల్లీ నుంచి అజ్మేరుకు వెళ్తుండగా కలిమోరి రైల్వే లేవల్ క్రాసింగ్ వద్ద పట్టాల పైకి జింక రావడంతో ఢీకొట్టింది. జింక వెళ్లి ఓ వ్యక్తిపై పడడంతో అతడు మృతి చెందాడు. మృతుడు శివదయాళ్ గతంలో రైల్వే శాఖలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అప్పుడు కరోనాతో మృతి….. ఇప్పుడు ఇంటికి తిరిగొచ్చాడు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News