Monday, December 23, 2024

కనకపురలో డికెఎస్‌పై డికెఎస్ పోటీ: కాంగ్రెస్ ముందు జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బెంగళూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపి డికె సురేష్ గురువారం కనకపురా అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సోదరుడు, పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ కూడా ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా డికె సురేష్‌ను కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

డికె శివకుమార్‌పై మొత్తం 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో వీటిపైన ఇప్పటివరకు తీర్పులు వెలువడలేదు. ఈ కేసులలో మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఆదాయం పన్ను ఎగవత కేసులు కూడా ఉన్నాయి. వీటిపైన శిక్షలు పడనప్పటికీ ముందు జాగ్తత్తగా ఉండాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి దుర్వినియోగం చేస్తుందని అందరికీ తెలుసునని, నిస్పృహతో ఆ పార్టీ డికె శివకుమార్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వారు తెలిపారు.అందుకే డమ్మీ అభ్యర్థిగా డికె సురేష్‌ను నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని వారు చెప్పారు. కనకపురాలో డికె శివకుమార్‌పై పోటీకి పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ అశోకను బిజెపి బరిలోకి దించింది. శివకుమార్‌లాగే అవోక కూడా వొక్కలిగ కులానికి చెందిన వ్యక్తి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News