Thursday, January 23, 2025

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం: నలుగురు మృతి (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఆరావళి : గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలో బాణసంచా తయారీ కంపెనీలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అరవల్లి జిల్లాలో బాణసంచా తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. బాణసంచా పేలుడు శబ్దాలతో పరిసరాలు దద్దరిల్లాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న రెండు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.

సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. వీడియోలో, నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు కనిపించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News