Monday, January 20, 2025

మనమే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

మన రాష్ట్రంలో ఉ న్న ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపే తం చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆ ర్థిక, శాఖ మంత్రి హరీశ్‌రావు పే ర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ రోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్‌ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నామని తెలిపా రు. ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ రాకుం డా కార్పొరేట్ తరహాలో క్వాలిటీ సేవలు అం దిస్తున్నామన్నారు. మన విధానం అనేక రా ష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, సింగల్ యూజ్ డయాలసిస్ ఫిల్టర్‌ను తెలంగాణకు పరిచయం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే ద క్కుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న డయాలసిస్ సేవలు యావత్ దేశానికే ఆదర్శమని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లి ఏరియా హాస్పిటల్‌లో గురువారం 5 పడకల డయాలసిస్ కేం ద్రం, బ్లడ్ బ్యాంక్‌లను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మాట్లాడుతూ, నాంపల్లి ఏరియా హాస్పిటల్‌కు చాలా మంది పేదలు వస్తారని, వారికి మరిం త మెరుగైన సేవలు అందాలన్న ఎంఎల్‌ఎ జా ఫర్ హుస్సేన్ విజ్ఞప్తి మేరకు వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు.

ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలో మాత్రమే డయాలసిస్ సెం టర్లు ఉండేవని, రోగులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చేదని చెప్పా రు. సిఎం కెసిఆర్ ఈ సమస్యను మానవతా హృదయంతో ఆలోచించి పరిష్కారం చూపించారని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ చేయాలని ఆదేశించారు. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వంలో 3 నుంచి 102కు పెంచామని వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తున్నదని వివరించారు.
డయాలసిస్ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్‌పాస్
తెలంగాణలో డయాలసిస్ రోగులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛను, ఉచిత బస్‌పాస్ కూడా ఇస్తున్నామని మంత్రి అన్నారు. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తున్నదని, ఈ సర్జరీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయించుకుంటే రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత అవసరమయ్యే మందులను కూడా జీవితకాలం ఉచితంగా అందిస్తున్నామని అన్నారు.

కిడ్నీ రోగుల కోసం ఏడాదికి రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే, అందులో ఒక్క డయాలసిస్ రోగుల కోసం ఏడాదికి రూ.100 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి మన రాష్ట్రంలో 28 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఉంటే, ఇపుడు ఆ సంఖ్యను 56కి పెంచుకున్నామని అన్నారు. 27 బ్లడ్ బ్యాంక్‌లకు కాంపోనెంట్ సపరేటర్స్ ఇచ్చామని, వాటి వల్ల ఒక యూనిట్ రక్తాన్ని ముగ్గురు నలుగురికి వాడుతున్నట్లు పేర్కొన్నారు.
నిమ్స్‌కు అదనంగా 2000 పడకలు మంజూరు
నిమ్స్ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వరంగల్ హెల్త్ సిటీతో పాటు హైదరాబాద్ నలువైపులా నాలుగు ఆసుపత్రులను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. గత కాంగ్రెస్,టిడిపి హయంలో ఇలాంటి ఒక్క ఆసుపత్రిని నిర్మించలేదని అన్నారు. సిఎం కెసిఆర్ నిమ్స్‌కు అదనంగా 2000 పడకలను మంజూరు చేశారని, వీటి ద్వారా 6000 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.

గొప్ప ప్రభుత్వాలు అని చెప్పుకొనే కాంగ్రెస్, టిడిపిలు హైదరాబాద్‌లో ఒక్క ఆసుపత్రి కూడా పెట్టలేదని, బ్రిటిష్, నిజాం కాలంలో కట్టిన గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులే ఉన్నాయని విమర్శించారు. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. నాంపల్లిలో 64 మంది డాక్టర్లు పనిచేస్తున్నారని వివరించారు. ట్రామా కేర్ సెంటర్లు బలోపేతం చేస్తామని అన్నారు. లెవల్ 1, 2, 3 గా వర్గీకరించి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అత్యవసర సేవలు కార్పొరేట్ తరహాలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఆసుపత్రుల మెయింటినెన్స్‌కు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలో ఆసుపత్రుల్లో మెయింటినెన్స్ కోసం నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒక్కో బెడ్‌కు రూ.7,500 ఇస్తున్న ఒకే ప్రభుత్వం సిఎం కెసిఆర్ ప్రభుత్వమని చెప్పారు. డైట్ చార్జీలను కూడా రెట్టింపు చేశామని గుర్తు చేశారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు దేశంలోని మొదటిసారిగా మిడ్ వైఫరీ వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. నాంపల్లిలోనే 18 నెలలు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో 30 శాతం ప్రసవాలు జరిగితే ఇప్పుడు 65 శాతానికి పెరిగాయని, ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగింది అనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.
కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లకు బడ్జెట్‌లో రూ.250 కోట్లు
మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్‌ను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఒకటి రెండు వారాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇందుకోసం బడ్జెట్‌లో సిఎం కెసిఆర్ రూ.250 కోట్లు కేటాయించారని చెప్పారు. 6.5 లక్షల మంది గర్భిణులకు వీటిని అందిస్తామని తెలిపారు. ఇప్పటికే లక్ష కిట్లు జిల్లాలకు పంపించామని, మరో లక్ష సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News