Saturday, December 21, 2024

ఎర్లీబర్డ్‌తో బల్దియాకు కాసుల గలగల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసి ఎర్లీబర్డ్ పథకకానికి గ్రేటర్‌వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఏడాది కూడా ఎర్లీబర్డ్ మంచి ఆదరణ లభించడంతో బల్దియాకు కాసులు వర్షం కురిసింది. గడిచిన 20 రోజుల్లో ఇప్పటి వరకు రూ.386 కోట్లు వసూళ్లు అయ్యా యి. 4,55,374 ఆస్తులకు సంబంధించి ఇప్పటి వరకు ఆస్తి పన్నును చెల్లించారు. శేరిలింగంపల్లి సర్కిల్‌లో అత్యధికం 36,220 ఆస్తులకు సంబంధించి రూ.52.23 కోట్లు చెల్లించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ సర్కిల్ రూ. 42.51 కోట్లు, ఖైరతాబాద్ సర్కిల్‌లోరూ. 3.42కోట్లు ఎర్లీబర్డ్ కింద వచ్చాయి. ముందస్తు ఆస్తిపన్ను చెల్లించేవారికి ఎర్లీబర్డ్ పథకం కింద జిహెచ్‌ఎంసి 5శాతం రాయితీ ఇస్తుండడంతో ప్రతి ఏటా ఈ పథకం ద్వారా జిహెచ్‌ఎంసికి ఈ ఒక నెలలోనే సుమారు 40 శాతం ఆస్తిపన్ను వసూళ్లు అవుతున్నాయి. గత ఆర్ధిక సంవత్సరం లో ఎర్లీబర్డ్ కింద సుమారు రూ.700 కోట్లు వసూళ్లు కావడంతో ఈ ఏడాది రూ. 750 కోట్లు లక్ష్యాన్ని అధికారులు నిర్ధేశించుకున్నారు. ఇందులో భాగంగా ఎర్లీబర్డ్‌ను ఏఫ్రిల్ 1న ప్రారంభించిన అధికారులు 30 తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రకటించారు.

కాసుల వర్షం
ఎర్లీబర్డ్ పథకం కింద ఈ ఏడాది రికార్డుస్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు అవుతున్నాయి. ఏడాదిలో 12 నెలలు ఉంటే ఈ ఒక నెలల్లో 40 శాతం మేర ఆస్తు పన్నులను ప్రజలు చెల్లిస్తున్నారు. గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి గ్రేటర్‌లో సుమారు రూ.1700 ఆస్తి పన్ను వసూళ్లు అవ్వగా, కేవలం నెల రోజుల్లో దాదాపు రూ.700 కోట్ల ఆస్తుపన్ను ప్రజలు చెల్లించారు.11 నెలల్లో రూ.1000 కోట్లు నెలకు సగటున రూ.90కోట్లు వసూళ్లు అవుతే ఏప్రిల్ ఒక నెలలలో రూ.700 రావడం , ఇది ఎర్లీబర్డ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు కావడంతో అధికారులు ఈ ఏడాది మరింత రాబట్టేందుకు కృషి చేస్తున్నారు.
గత ఏడాది ఏఫ్రిల్ 26 వ తేదీనాటికి రూ.473 కోట్లు రాగా,ఈ సంవత్సరం 20వ తేదీ నాటికే రూ.386 కోట్లు వసూళ్లు అయ్యాయి. అంతేకాకుండా గత ఏడాది చివరి నాలుగు రోజుల వ్యవధిలో సుమారు రూ.227 కోట్లు వసూళ్లు కావడంతో ఈ సంవత్సరం మరో 10 రోజులు గడువు ఉండడంతో లక్షాన్నికి మించి వసూళ్లు అవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది మరింత స్పందన
ఎర్లీబర్డ్ పథకానికి నగర వాసుల నుంచి అంతకంతా స్పందన లభిస్తోంది. 2016 నుంచి జిహెచ్‌ఎంసి ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, మొదటి ఏడాది రూ.325 కోట్లు వసూళ్లు కాగా, ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 2019 నాటికి రూ. 535. కోట్లుకు చేరింది. ఈ తర్వాత 2020 లో రూ. రూ.573 కోట్లు రాగా, 2021 సంవత్సరంలో రూ. 580 కోట్లు వచ్చాయి., గత ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.700 కోట్లు వసూళ్లు కావడంతో ఈ ఏడాది అంచనాలకు మించి మరింత అధికంగా వసూళ్లు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News