- Advertisement -
న్యూఢిల్లీ: హింసాత్మక ఘర్షణలతో సంక్షుభితంగా మారిన సూడాన్‌లో చిక్కుకుపోయిన 3 వేల మందికి పైగా భారతీయు భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. సూడాన్‌లో తాజా పరిస్థితిని ప్రధాని అధ్యయనం చేశారు.
సూడాన్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు. వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, సూడాన్‌లోని భారతీయులను వేగంగా, సురక్షితంగా తరలించేందుకు ప్రణాళికాలను రూపొందించాలని ప్రధాని మోడీ ఆదేశించారని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -