Monday, December 23, 2024

ఈటల ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. మునుగోడు ఎన్నికల్లో రేవంత్ డబ్బు తీసుకున్నారని ఈటల ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్ నుంచి రేవంత్ డబ్బులు తీసుకున్నారని ఈటల అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మాదేనని రేవంత్ పేర్కొన్నారు.

బిఆర్ఎస్ నుంచి కానీ… కెసిఆర్ నుంచి కానీ డబ్బు తీసుకోలేదనని ఆయన వెల్లడించారు. రేపు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తానని చెప్పారు. రేపు సాయంత్రం తడిబట్టలతో ప్రమాణం చేస్తానన్న రేవంత్ ఈటల దిగజారి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నానని చెప్పారు. భాగ్యలక్ష్మి ఆలయం కాదంటే మరే ఆలయానికైనా వస్తానన్నారు. ఏ ఆలయంలో అయినా సరే.. తడిబట్టలతో ప్రమాణం చేస్తానని తేల్చి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News