Sunday, December 22, 2024

అన్నారంలో మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు కానుకగా ఇస్తున్న రంజాన్ దుస్తులను బీఆర్‌ఎస్ నాయకులు పంపిణీ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని మతాలను అధికారికంగా నిర్వహిస్తూ సమాన ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. మైనార్టీ సోదరులు అబివృద్ధి చేసే నాయకులను మరువద్దని ప్రభుత్వం నుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

ఈ సందర్బంగా కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూడలి అమృతబాలరాజు, ఉప సర్పంచ్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ గడ్డం చంద్రకళ గంగారెడ్డి,బీఆర్‌ఎస్ నాయకులు ఆసరి కిషన్,దేవదాసు,ఆటో లక్ష్మణ్,సతీష్ గౌడ్,శ్రీను,లతీఫ్,మైబూబ్,వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News