Saturday, November 23, 2024

మే 5 నుండి సమ్మెకెళ్తాం: విద్యుత్ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో మే నెల 5వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామంటూ తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కె. ఈశ్వర్ రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి జె. ప్రసాద రాజులు ఈ మేరకు శుక్రవారం నాడు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి, ఎస్‌పిడిసిఎల్, ఎన్‌పిడిసిఎల్ సిఎండిలకు సమ్మె నోటీసు(లేఖ)ను అందజేశారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో పని చేస్తున్న ఆర్టిజన్స్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని యాజమాన్యాలను అనేక సార్లు కోరినా తమ సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు.

ఈ క్రమంలో తమ డిమాండ్లను యాజమాన్యం ముందు పెడుతున్నామంటూ డిమాండ్లను వివరించారు. సీనియారిటినీ బట్టి ఆర్టిజన్ ఉద్యోగులను రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేయాలని. ఒకే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఒకే సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఈ కార్మికులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్స్ ఇవ్వాలని, ఆర్టిజన్స్‌కి పిఎఫ్‌పై సీలింగ్ తొలగించి బేసిక్ ప్లస్ డిఏ మొత్తానికి పిఎఫ్ షేర్ చెల్లించాలని, ఈ కార్మికులకు పాతపద్దతి ప్రకారం హౌజ్ రెంట్ అలవెన్సులు ఇవ్వాలని, ఆర్టిజన్స్ కారుణ్య నియామకాలలో అర్హతను బట్టి తగిన గ్రేడ్ ఉద్యోగం ఇవ్వాలని , పని భారం నేపథ్యంలో 33/11 కెవి సబ్ స్టేషన్లలో 4వ ఆపరేటర్నీ కూడా నియమించుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News