Monday, December 23, 2024

వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన ఆర్డర్ అంటూ ఆక్షేపించింది. అన్ యాక్సెప్టబుల్ అంది. వాదనలు పూర్తైన తర్వాత హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది. దీనిపై స్పందించిన అవినాష్ రెడ్డి న్యాయవాది ఇప్పటికిప్పుడు స్టే ఇస్తే తన క్లయింట్‌ను సిబిఐ అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు.

అయితే సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాల్లో పేర్కొంది సుప్రీంకోర్టు. అనంతరం ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది. వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, రెండు రోజుల వాదనలు తర్వాత ధర్మాసనం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25వ తేదీ వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ఈ తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సునీత గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. శుక్రవారం విచారణకు స్వీకరిస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News