హైదరాబాద్: స్నేహితుడి ఇంటికి వెళ్లి యువతి అదృశ్యమైన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. కుటుంబసభ్యులు , పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మహరాష్ట్రకు చెందిన చెందిన ఉత్తమ్ రావు గత పది సంవత్సరాల బోయిన్ పల్లిలో నివసిస్తూ స్థానికంగా ఉండే ఓ స్కూల్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది.
కాగా ఇటివల తను చదువున్న కాలేజీలో ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ విషయం కాస్తా యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో యువతి తల్లిదండ్రులు యువతిని మందలించారు. ఈ క్రమంలో శుక్రవారం యువతి స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో యువతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి బోయిన్ పల్లి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.