హైదరాబాద్: ఐపిఎల్ అంటేనే క్రికెట్ ప్రియులకు ఎంతగానో ఇష్టం. 20 ఓవర్లతో సాగే మ్యాచ్ ను చూసేందుకు టీవీలకు అతుక్కుపోతారు. అందులోనూ తమకు ఇష్టమైన ఆటగాళ్లు కెప్టెన్సీ చేసే మ్యాచులను చూసి మరింత ఆనందిస్తారు. అది అంతవరకు ఉంటే ఓకే. కానీ క్రికెట్ ఇష్టం కాస్త బెట్టింగ్ కు దారీ తీస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్య నగరాల్లోనే కాకుండా జిల్లాల్లోనూ ఐపిఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది.
రోజు రోజుకు ఎక్కడో అక్కడ ఐపిఎల్ బెట్టింగ్ ముఠాలు పట్టుబడుతున్నాయి. ఐపిఎల్ పై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ కేసులో ముగ్గురిని బాచుపల్లి పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 20 లక్షలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, వహానాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.