Tuesday, December 24, 2024

కృత్రిమ మేధస్సు జాబ్ హోల్డర్లను ప్రభావితం చేయనున్నది!

- Advertisement -
- Advertisement -
సర్వేలో 62 శాతం అమెరికన్ల వెల్లడి

వాషింగ్టన్: ఓపెన్ ఏఐ యొక్క చాట్ జిపిటి, ఇతర కృత్రిమ మేధస్సు(ఏఐ) మోడల్స్ ఇప్పుడు కలవరం పుట్టిస్తున్నాయి. అలాంటి కంప్యూటర్ మోడల్స్ జాబ్ హోల్డర్లను ప్రభావితం చేయనున్నాయని 62 శాతం అమెరికన్లు భావిస్తున్నారు. చాట్ జిపిటి మమ్మల్ని నిరుద్యోగులను చేస్తుందా? అని నేడు చాలా మంది కలవరం చెందుతున్నారు. అయితే ఈ వాదనను ఇన్ఫోసిస్ కోఫౌండర్ ఎన్.ఆర్. నారాయణ మూర్తి కొట్టిపారేశారు. చాట్ జిపిటి ఎప్పటికీ మానవ మేధస్సును భర్తీ చేయలేదన్నారు.
అయితే అమెరికన్లు మాత్రం చాట్ జిపిటి ప్రభావం ఉద్యోగులపై పడుతుందని భావిస్తున్నారని ‘ప్యూ పరిశోధన నివేదిక’ పేర్కొంది. కృత్రిమ మేధస్సును ఉపయోగించటాన్ని 71 శాతం అమెరికా పౌరులు వ్యతిరేకిస్తున్నారు. ఏఐని ఉపయోగించి ఉద్యోగులను తీసివేయడాన్ని మెజారిటీ అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News