Monday, December 23, 2024

రూ. 121 కోట్ల బంగారం కంటెయినర్ ఏమైంది?

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: అభిషేక్ బచ్చన్ నటించిన ప్లేయర్స్ అనే సిఇమా 2012లో విడుదలైంది. ఈ చిత్రంలో ఒక దొంగల ముఠా పటిష్టమైన భద్రతతో రైలులో రవాణా చేస్తున్న కోట్లాది రూపాలయల విలువైన బంగారాన్ని పక్కా ప్లాన్‌తో కొట్టేస్తుంది. ఇది సినిమా కథ వాస్తవానికి వస్తే.. కెనడాలో ఒక దొంగల ముఠా ఎంతో తెలివితో బంగారం తో ఉన్న ఒక కంటెయినర్‌ను చోరీ చేసింది. ఈ కంటెయినర్‌లో రూ. 121 కోట్ల విలువ చేసే బంగారం ఉంది. ఈ భారీ చోరీ అందరినీ షాక్‌కు గురిచేసింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎయిర్‌పోర్టులో బంగారం కంటెయినర్‌ను ఎలా చోరీ చేయగలిగారన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది.

మూడు రోజుల క్రితం ఈ చోరీ గురించి అక్కడి పోలీసులు ప్రకటించారు. ఈ సంఘటనతో పోలీసులకు నిద్ర కరువైంది. ఏప్రిల్ 17న టోరంటోలోని పీర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఒక కంటెయినర్ వచ్చింది. ఈ కంటెయినర్‌లో రూ. 121 కోట్ల విలువైన బంగారంతోపాటు ఇతర విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. విమానం నుంచి దింపిన తర్వాత ఈ కంటెయినర్‌ను ఎయిర్‌పోర్టులోని కంటెయినర్‌లను భద్రపరిచే ప్రదేశానికి తరలించారు. ఏప్రిల్ 20న ఆ కంటెయినర్ మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ వార్త బయటకు రావడంతో భద్రతాధికారులు భయాందోళన చెందారు.

బంగారం ఉన్న కంటెయినర్ చోరీ జరిగి మూడు రోజులైనా ఇప్పటివరకు దాని ఆచూకీ తెలియకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. విమానం నుంచి కంటెయినర్‌ను అన్‌లోడ్ చేయడం జరిగిందని స్థానిక పోలీసు ఇన్‌స్పెక్టర్ షీఫెన్ డువెస్టన్ టోరంటో నుంచి వెలువడే టోరంటో స్టార్ వార్తాపత్రికకు తెలిపారు. కంటెయినర్లు చోరీకి గురవ్వడం అత్యంత అరుదని ఆయన చెప్పారు. ఈ కంటెయినర్ ఎలా చోరీకి గురైందో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏ ఒక్కరిని అరెస్టు చేయలేదని ఆ అధికారి తెలిపారు. త్వరలోనే ఏదో ఒక క్లూ దొరకకపోదన్న ఆశాభావంతో పోలీసులు ఉన్నారు.

చోరీకి గురైన బంగారం బరువు 3,600పౌండ్లు ఉంటుందని వార్తాపత్రిక తెలిపింది. థర్డ్ పార్టీ నుంచి కంటెయినర్ల గిడ్డంగిని దొంగలు అద్దెకు తీసుకుని ఉంటారని, అక్కడ భద్రత ఎలా కొరవడిందో అర్థం కావడం లేదని పోలీసులు తెలిపారు. ఈ చోరీలో విదేశీ దొంగల ముఠా ప్రమేయం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యకం చేస్తున్నారు.
ఈకంటెయినర్ ఏ కంపెనీకి చెందింది..ఇది కెనడాకు ఏ విమానంలో వచ్చింది అన్న వివరాలు మాత్రం బయటకు పొక్కడం లేదు. అయితే రూ. 121 కోట్ల విలువైన బంగారంతో కూడిన కంటెయినర్ మాయం కావడం మాత్రం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News