Monday, December 23, 2024

తెలంగాణలో ఘనంగా జరుపుకున్న ఈద్‌-ఉల్‌-ఫిత్ర్ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంజాన్ నెల చివరలో జరుపుకునే ‘ఈద్‌ఉల్‌-ఫిత్ర్’ వేడుకలు హైదరాబాద్‌లో, తెలంగాణ అంతటా ముస్లింలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేంద్ర టూరిజం మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు ఈద్‌-ఉల్‌-ఫిత్ర్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. నమాజీలు ఈద్గాలు, మస్జిదుల్లో పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేశారు. ముఖ్యంగా మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్‌లోని హాకీ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేశారు.

ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, తెలంగాణ మంత్రులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అసదుద్దీన్ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందజేశారు. ఈద్ ప్రార్థనల సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ను కూడా నియంత్రించారు.

Eid-prayers2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News