- Advertisement -
జవహర్‌నగర్ : అక్రమ నిర్మాణాలను చేపడితే సహించేదిలేదని కాప్రా మండల గిర్దావర్ విశ్వనాథ్ హెచ్చరించారు. శనివారం జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్లు 693,348,158,210లలో నూతనంగా వెలసిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్, రెవెన్యూ సిబ్బందితో కలిసి జెసిబితో నేలమట్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల 58,59 జీ.ఓ పట్టాల పంపిణీ కార్యక్రమాలలో బిజీగా ఉండగా ఆక్రమణదారులు రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టినట్లు తెలిసిందన్నారు. ప్రజలు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైన వదిలిపెట్టేది లేదని, వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కూల్చివేతలో విఆర్‌ఏలు నాగరాజు, రాజు పాల్గొన్నారు.
- Advertisement -