Friday, November 15, 2024

సెప్టెంబర్‌లో భారత్‌కు బైడెన్ ?

- Advertisement -
- Advertisement -

జి 20 సమావేశాలకు సంసిద్ధం

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షులు జో బైడెన్ సెప్టెంబర్‌లో భారతదేశ పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఈ దిశలో బైడెన్ ఆలోచిస్తున్నారని వైట్‌హౌజ్ సంబంధిత దక్షిణాసియా, మధ్య ఆసియా వ్యవహారాల ప్రెసిడెంట్ ప్రతినిధి డోనాల్డ్ లూ వార్తా సంస్థలకు తెలిపారు. భారత్ అమెరికా దేశాల సంబంధాలలో ఈ ఏడాది 2023 మైలురాయి కానుందని, అమెరికాకు ఇది ఘననీయమైన సంవత్సరం అవుతుందని ఈ ప్రతినిధి తెలిపారు.

దక్షిణాసియా వ్యవహారాల పర్యవేక్షకులుగా ఉన్న డోనాల్డ్ అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. ఓ వైపు అమెరికా అపెక్‌కు ఆతిధ్యం ఇస్తోంది. జపాన్ జి 7 సదస్సుకు వేదిక అవుతోంది. జి 20 భేటీ భారతదేశంలో జరుగుతుంది. ప్రపంచ స్థాయిలో ఇటువంటి సమ్మేళనాలు పరస్పర సహకారం విస్తృతికి దోహదం చేస్తాయని అమెరికా ఆశిస్తోందని డోనాల్డ్ లూ తెలిపారు. వివిధ దేశాలను ప్రపంచ సమస్యల పరిష్కారం దిశలో ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఇటువంటి సమావేశాలు ఉపయోగపడుతాయని వివరించారు.

ప్రెసిడెంట్ బైడెన్ జి 20 నేపథ్యంలో సెప్టెంబర్‌లో ఇండియాలో పర్యటించాలని ఆలోచిస్తున్నారు. సంబంధిత వివరాలుత్వరలోనే ఖరారు అవుతాయని ఈ ప్రతినిధి చెప్పారు. భారతదేశంలో పర్యటించే అమెరికా బృందంలో విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్, ఆర్థిక మంత్రి జనెత్ యెల్లెన్, వాణిజ్య మంత్రి గినా రైమాండో కూడా ఉంటారని స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News