Monday, December 23, 2024

రంజాన్ వేడుకల్లో సినీ నటులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని, అందరు సోదర భావంతో కలిసి మెలిసి జీవించాలని పలువురు సినీ నటి నటులు ఆకాంక్షించారు. రంజాన్ పండును పురస్కరించుకుని బంజారాహిల్స్‌లో సినీ నటి సౌమ్య జాను విందును ఏర్పాటు చేశారు. ఈ రంజాన్ వేడుకలో వెండితెర, బుల్లితెర నటి, నటులతోపాటు పలువురు రాజకీయ, వ్యాపార, వైద్య రంగాలకు చెందిన పలువురు హాజరయ్యారు.

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సినీ నటులు బాలాజీ మధుమిత దంపతులు, నందిని రాయ్, అశ్వీని శ్రీ, రితికా, అలేఖ్య, శ్రావన్ రాఘవేంధ్ర, కుమనన్ సేతు రామణ్, శ్రీధర్ రావు, కృష్ బండిపల్లి, జబర్దస్త్ ఫణి, మహేష్, బిగ్ బాస్ జస్సీ , సినీ నిర్మాత సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌమ్య జాను మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజు ఇలా అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News