Saturday, September 21, 2024

బరువు తగ్గాలన్న కోరిక.. చివరకు..

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : బరువు తగ్గాలన్న కోరిక తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… కార్ఖానకు చెందిన మహేశ్వరి (30) ఆశోక్ దంపతులు. భర్త ఆశోక్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 81 కేజీలు ఉన్న మహేశ్వరి బరువు తగ్గాలన్న కోరికతో టివీలో, సోషల్ మీడియా తదితర ప్రచార మాద్యమాల ద్వారా కార్ఖానలో ఉన్న కలర్స్ వేయిట్ లాస్ సంస్థ గురించి తెలుసుకొని అందులో చేరింది. సంస్థ మహేశ్వరికి 15 కేజీల బరువును తగ్గించటానికి 40 వేల రూపాయలకు సంబందించిన ప్యాకేజీని సెలక్ట్ చేసుకొని ఈనెల 15న ఆడ్వాన్స్ పేమెంట్ క్రింద ఏడు వేల రూపాయలను సంస్థకు చెల్లించింది. ట్రీట్‌మెంట్‌లో భాగంగా మొదటి రోజు మాసాజ్, రెండవరోజు ఎలక్ట్రిక్ వైబ్రెట్‌తో ట్రీట్‌మెంట్ చేయటంతో మహేశ్వరికి వాంతులు అయ్యాయి.

అమే వారిని ప్రశ్నించగా వాంతులు కావటం మాములే అని సర్థి చెప్పారు. తిరిగి ఈనెల 21న ట్రీట్‌మెంట్‌కు పిలిచి మారోమారు ఎలక్ట్రిక్ వైబ్రెట్‌ను ఉపయోగించి ట్రీట్ మెంట్ చేయటంతో కడుపునొప్పి, వాంతులతో అక్కడ ఉన్న బాత్రుంలో అపస్మారక స్థితిలో పడిపోయింది. తోటివారి సమాచారంతో విషయం తెలుసుకున్న భర్త సంస్థకు చేరుకొని తన భార్య మహేశ్వరిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అమేను పరిక్షీంచిన వైద్యులు అమే పరిస్థితి అందోళనకరంగా ఉందని చెప్పటంతో మహేశ్వరి భర్త అశోక్ అమే సోదరి బంధువులు కలర్స్‌సంస్థలో చేస్తున్న వేయిట్‌లాస్ విధానంతో చాలమంది ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సంస్థను మూసి వేయాలని డిమాండ్ చేసారు. అనంతరం కలర్స్ సంస్థపై చర్యలు తీసుకోవాలని కార్ఖాన పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News