Monday, November 25, 2024

సుందర్ పిచాయ్‌కు రూ.1850కోట్ల పారితోషకం

- Advertisement -
- Advertisement -

కాలిఫోర్నియా: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సిఇఒ సుందర్ పిచాయ్ 2022సంవత్సరానికి రూ.1850కోట్ల పారితోషకం అందుకున్నారు. గతేడాది సిఇఒ సుందర్ పిచాయ్ సుమారు 226మిలియన్ డాలర్లు అందుకున్నట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అల్ఫాబెట్‌లో సగటు ఉద్యోగి పోలిస్తే ఇది 800రెట్లు ఎక్కువ. ఆర్థికమాంద్య ముప్పు నేపథ్యంలో లేఆఫ్‌ల వేళ పిచాయ్ ఈమేరకు భారీ వేతనం అందుకోవడం విశేషం.

ఈ పారితోషకంలో 218మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులు ఉన్నాయి. మూడేళ్ల కాలానికి పిచాయ్ ఈ స్టాక్ అవార్డును అందుకున్నారు. కాగా గత మూడేళ్లుగా పిచాయ్ నిలకడగా 2మిలియన్ డాలర్ల వార్షిక వేతనం అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు ఖర్చు నియంత్రణలో భాగంగా 12వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆల్ఫాబెట్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News