హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో డబ్బులిచ్చి పదవులు కొనుక్కోవడం, డబ్బులు తీసుకోవడం ఆనవాయితీగా మారిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు బిఆర్‌ఎస్ పార్టీ ఇచ్చారనే విషయం బహిరంగ రహస్యమే అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కాంగ్రెస్‌వి చిల్లర ఆరోపణలు..
ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను కేంద్ర జాతీయ విపత్తుల నివారణ సంస్థ మాజీ సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి ఖండించారు. ఈటలపై కాంగ్రెస్‌లోని రేవంత్ రెడ్డి వర్గం ఎందుకంత ఒంటికాలిపై లేస్తున్నారో ఆ పార్టీలోని ప్రతి ఒక్కరికీ తెలుసు అన్నారు. బిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు ఎలాంటి బంధం ఉందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే తెలుస్తుందన్నారు.