మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: ప్రభుత్వాసుపత్రి వైద్య సేవలు బలోపేతం దిశగా అడుగులు వేస్తూ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో వైద్య సేవల్లో విప్లవత్మక మార్పులు తెస్తుంది. క్యాన్సర్ అనే మాట ఉంటేనే గుండె పగిలిపోయే బాధ. మంత్రి హరీశ్‌రావు ఏ సమావేశంకు వెళ్లిన చెప్పే మాట ప్లాస్టిక్ వాడకండి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులకు కారణం కాకండి అనే చేప్పే మాట. ఎవరు అయిన చనిపోతే పరామర్శకు వెళితే పదిమందిలో 8 మంది క్యాన్సర్‌తో చనిపోయారు అనే విన్నమాట క్యాన్సర్ వ్యాధి. బాధ, వ్యద ప్రత్యక్షంగా తన కుటుంబంలో చూస్తున్న సందర్భం మంత్రి హరీశ్‌రావును ఎంతో కలిచి వేసిన నేపథ్యంలో సిద్దిపేట ప్రజలు ఈ బాధలు పడొద్దు. క్యాన్సర్ రావడం ఒక బాధ అయితే వారు హైదరాబాద్ వెళ్లి చికిత్స చేపించుకోవడం ఇంకో బాధగా మారింది. ఆర్థ్ధిక స్థోమత లేక వ్యాది కంటే బాధ ఎక్కువై చనిపోయిన వారు ఎందరో అని మంత్రి గమనించారు. అలాంటి పరిస్థ్ధితి సిద్దిపేట ప్రజలకు రావొద్దు.. ఈ బాధలు ఉండొద్దు అని సిద్దిపేటలోనే మన ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు కానుంది.
మంత్రి హరీశ్‌రావు కృషితో క్యాన్సర్ వ్యాధికి కీమోథెరఫి డే కేర్ సెంటర్
హైదరాబాద్, వరంగల్ ఇతర ప్రాంతాలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా సిద్దిపేటలోనే క్యాన్సర్ చికిత్స అందించాలనే సంకల్పంతో మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో క్యాన్సర్ వ్యాధి తొలి అడుగు వేశారు. ఎంఎన్‌జి, నిమ్స్‌లో ఉండే ప్రత్యేక వైద్య బృందంతో 4 బెడ్స్‌తో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే అన్ని సౌకర్యాలతో సిద్ధ్దం అయింది. ఈ కీమోథెరెఫి సెంటర్ ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వైద్య సేవలు అందుతాయి. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారు మొదట, రెండవ సారి నిమ్స్‌లో , ఎంఎన్‌జిఇలో కీమోథెరఫి చేపించుకొని మూడవ సారి నుంచి మన సిద్దిపేటలో చికిత్స చేపించుకునే అవకాశం ఉంటుంది. అన్ని సౌకర్యాలతో సిద్దిపేట ఆసుపత్రిలో సిద్ధ్దం అయింది. నేడు మంత్రి హరీశ్‌రావు కీమోథెరఫి డే కేర్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.
సాధారణ ఓపి నుంచి కీమోథెరఫి దాకా అన్ని ఉచితమే
సిద్దిపేట మెడికల్ కళాశాల జనరల్ ఆసుపత్రిలో చిన్న వైద్యం నుంచి పెద్ద వైద్యం దాకా అన్ని రకాల చికిత్సలు ఉచితంగానే అందుబాటులోకి వచ్చాయి. సాధారణ జ్వర లక్షణాలు ఉన్న బాధిదుల నుంచి ప్రమాదకరమైన క్యా న్సర్, గుండె , ఊపిరితిత్తులు, కిడ్ని వ్యాధుల చికిత్సలకు మన పెద్ద ఆసుపత్రిలో చిరునామాగా మారింది. కార్పొరేట్ ఆసుపత్రులు, రీజనల్ ఆసుపత్రులకే పరిమితమైన క్యాన్సర్ కీమోథెరఫి సేవలు ఇప్పుడు సిద్దిపేట ఆసుపత్రి లో కూడా ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కసారి కీమోథెరఫి చేయించాలంటే రూ. 10 నుంచి 20 వేల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వీటికి తోడు క్యాన్సర్ బాధితులు హైదరాబాద్‌లో ఉండడానికి వసతి, భోజనం రవాణా ఖర్చులు అదనం అనీ సిద్దిపేట ఆసుపత్రిలో పూర్తిగా కీమోథెరఫి వైద్య సేవలు ఉచితంగా చేయనున్నారు. కీమోథెరఫి ఉండడంతో బాధితులకు ఎలాంటి అదనపు ఖర్చులు ఉండబోవు. ఇలాంటి ఆ ర్థ్ధిక బాధలు, ఇబ్బందులను తొలగించడానికే మంత్రి హరీశ్‌రావు మనోధైర్యమైన నిర్ణయాన్ని ఆచరణలోకి తెస్తున్నారు.
తీరనున్న ఆర్థిక బాధలు, వ్యయ ప్రయాస
క్యాన్సర్ మాట వింటే మనసు కదిలించే బాధ వచ్చిన క్ష ణం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు పేద కుటుంబానికి బ్రతుకే భారం అనుకున్న కుటుంబానికి ఈ వ్యాధి పెద్ద గుది బండగా మారింది. క్యాన్సర్ వచ్చింది అంటే హైదరాబాద్ వెళ్లాలి. ప్రైవేట్ ఆసుపత్రికి పోతే ఆర్థ్ధిక పరిస్ధితి అ డ్డు. ప్రభుత్వాసుపత్రికి పోతే తగ్గుతుందా లేదా అనే అప నమ్మకం అలాంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం. ఆపరి స్థ్ధితి రావద్దు హైదరాబాద్‌కి వెళితే ప్రయాణ ఖర్చు హాస్పిటల్ ఖర్చులు ఇలా ఎన్నో బాధలు ఆ బాధలు ఆ తిప్పులు పోవాలి మానసికంగా మనోధైర్యాన్ని ఇవ్వాలి అనే ఉదారతతో మంత్రి హరీశ్ రాష్ట్రంలోని జిల్లా స్థాయి ఆసుపత్రి లో హైదరాబాద్ తర్వాత మన సిద్దిపేటలోనే క్యాన్సర్ వ్యా ధికి కీమోథెరఫి సెంటర్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోయే వ్య ప్రయాసాలు ఆర్థ్ధిక భారం తగ్గుతుంది.
మనసు కదిలించే సందర్భాలు ఎన్నో: మంత్రి
నేను ఎవరైనా చనిపోతే పరామర్శకు వెళితే ఎలా చనిపోయారు అని తెలుసుకుంటే 10 మందిలో 8 మంది క్యాన్సర్‌తో అని.. దగ్గరి వాళ్లు ఒక్కోసారి అనారోగ్యంతో ఉన్నాడు అని తెల్సి వెళ్లితే క్యాన్సర్ అని విన్నా ఇలా ఎన్నో సందర్భాలు. నాకుటుంబంలో కూడా ప్రత్యక్షంగా చూస్తున్న ఆ బాధా మానసికంగా పడే బాధ చెప్పరానిది. ఇలాంటి ఎన్నో సంఘటనలు నా మనసు కదిలించింది. వచ్చినవారు హైదరాబాద్‌కు వెళ్లి వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా సిద్దిపేట ప్రజలకు వ్యాధి బాధ ఆర్థ్ధిక బాధను తిరేలా సిద్దిపేటలోనే మన ప్రభుత్వాసుపత్రిలో క్యాన్యర్ వ్యాధి చికిత్స అందుబాటులోకి తెచ్చాం. ప్రజలకు ఇలాంటి వైద్యం ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా చేయడం వైద్య శాఖ మంత్రిగా నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది.