Monday, December 23, 2024

రిలయన్స్ , ఆర్‌ఎన్‌ఈఎల్ విలీనంకు బ్రేక్!

- Advertisement -
- Advertisement -

ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా భారత దేశంలోనే అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అనుబంధ సంస్థ ‘రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్’(ఆర్‌ఎన్‌ఈఎల్)ని తనలో విలీనం చేసుకునే ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని నేరుగా చేపట్టాలనే లక్ష్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గత ఏడాది మేలో ఈ విలీనానికి ఆమోదం తెలిపింది. కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదనను మార్చుకుంది. విలీనం విషయంలో తాము ముందుకు సాగడం లేదని ఆ కంపెనీ శనివారం తెలిపింది. ఇక పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని ఆర్‌ఎన్‌ఈఎల్ చేపడుతుంది. విలీన పథకం ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ముంబై ధర్మాసనం కోసం పెండింగ్‌లో ఉంది. నూతన ఇంధనం/పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని ఆర్‌ఎన్‌ఈఎల్ ద్వారా చేపట్టాలని, విలీనాన్ని ఉపసంహరించుకోవాలని బోర్డు ఇప్పుడు నిర్ణయించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News