Friday, November 22, 2024

కర్నాటక అసెంబ్లీ త్రిముఖ పోటీ బరిలో యోధానయోధులు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధం అయ్యాయి. మే 10న సింగిల్ ఫేస్‌లో పోలింగ్ జరుగనున్నది. ప్రతిపార్టీ పూర్తి శక్తితో పోటీపడాలని చూస్తోంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. కర్నాటకలో ప్రధానంగా త్రిముఖ పోటీ ఉండనున్నది. అంటే కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యూలర్), బిజెపి మధ్యనే పోటీ ఉండనున్నది. కాంగ్రెస్ వీలయినంతగా ఎక్కువ సీట్లు గెలుచుకోజూస్తోంది. కాగా బిజెపి తన అధికారాన్ని ఎలాగైనా మళ్లీ నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్ గతంలో ఓడిన సీట్లను కూడా తిరిగి గెలువాలని ప్రయత్నిస్తోంది. అనేక నియోజకవర్గాల్లో కీలక నేతలు పోటీపడుతున్నారు. వారిలో బసవరాజ్ బొమ్మై, డి.కె. శివకుమార్, యెడియూరప్ప కుమారుడు విజయేంద్ర, యశ్‌పాల్ సువర్ణ, జగదీశ్ శెట్టర్ వంటి కీలక నేతలు బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 24.

కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల ఓటర్లు ఉన్నారు. వారిలో 2.59 కోట్లు మహిళా ఓటర్లు , 2.62 కోట్లు పురుష ఓటర్లు ఉన్నారు. కాగా శతాధిక వయస్సు ఉన్న ఓటర్లు 16976 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 4699 మంది, 9.17 లక్షల ఓటర్లు మొదటిసారి ఓటేస్తున్నవారిగా ఉన్నారు. ఇప్పటి కర్నాటక అసెంబ్లీ పదవీ కాలం మే 24తో ముగియనున్నది.
కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 113 సీట్లు ఏ పార్టీ అయినా గెలువాల్సిందే. కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ఎస్సీలకు 36 సీట్లు రిజర్వు చేయగా, ఎస్టీలకు 15 సీట్లు రిజర్వు చేశారు. ప్రస్తుతం బిజెపికి 119 ఎంఎల్‌ఏలు, కాంగ్రెస్‌కు 75 ఎంఎల్‌ఏలు, జెడి(ఎస్)కు 28 మంది ఎంఎల్‌ఏలు ఉన్నారు. కాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మే 13న ప్రకటించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News