Friday, December 20, 2024

కుక్కల దాడిలో నలుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కుంటాల ః  మండల కేంద్రమైన కుంటాలతో పాటు అంబకంటి గ్రామాల్లోని ఆదివారం కుక్కల దాడిలో నలుగురికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. కుంటాలలో కుక్కల దాడిలో స్వాతి, నాగరాజులకు  గాయాలైయ్యాయి. చికిత్స నిమిత్తం ముగ్గురు కుంటాల ప్రాథమిక ఆరోగ్య  కేంద్రానికి వెళ్లారు. కాగా కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన  స్వాతిని అక్కడి వైద్యులు  నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతే కాకుండా అంబకంటి గ్రామానికి చెందిన రమ్యకు కుక్కల దాడిలో గాయాల పాలు కావడంతో వెంటనే కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని ప్రథమ చికిత్సలు చేసుకున్నారు.

దీంతో ఒకే రోజు వీధి కుక్కలు నలుగురి పై దాడి చేయడంతో మండల వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.గత వారం పది రోజుల క్రితం అందకూర్ గ్రామంలోని ఓ రైతుకు చెందిన మేకలు కుక్కల దాడిలో మృతి చెందడంతో ఆ రైతుకు భారీ నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి కుక్కల దాడిలో అరికట్టాల్సిన అవసకం ఎంతైన ఉంది. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువ కావడంతో  దాడి చేస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News