- Advertisement -
హైదరాబాద్: విశాఖ జిల్లా సింహచలం పుణ్యక్షేత్రంలో వరాహ నరసింహ స్వామి చందనోత్సవాన్ని పురస్కరించుకొని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మిస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేదమంత్రాల ఆశీర్వాదంతో స్వామివారి ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు.
అంతకుముందు ఆలయ అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు సాదారంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు.
- Advertisement -