Friday, December 20, 2024

సవాల్‌కు తాను సిద్ధమే : రఘునందన్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రమంత్రి నిరంజన్‌రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ఎప్పుడు పిలిచానా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన సవాల్‌కు తాను సిద్ధమన్నారు. తన ఆరోపణలకు స్పందించి, ఆహ్వానించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఏప్రిల్ 23న మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములను తాను కబ్జా చేశానని రఘునందన్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఈ మేరకు రఘునందన్‌రావు స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News