ముంబయి: టీమిండియా క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ నేడు 50వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు తన పేరిట సచిన్ నమోదు చేసుకున్నాడు. 1989 నవంబర్ 16న సచిన్ కరాచీలో పాక్‌తో జరిగిన టెస్టులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 1990 ఆగస్టు 14న టెస్టుల్లో సచిన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. 1994లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 110పరుగులు చేసిన సచిన్ వన్డేల్లో తొలి శతకాన్ని సాధించాడు. 1996లో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2006డిసెంబరు 1న దక్షిణాఫ్రికాతో ఏకైక టి20మ్యాచ్ ఆడిన సచిన్ పది పరుగులు మాత్రమే చేశాడు.
2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో 200పరుగులు చేసి వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. 2012లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి మొత్తం 100సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. 2013 నవంబర్ 16న వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వ్యక్తిగత 200మ్యాచ్‌ను ఆడిన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి దాదాపు పదేళ్లు పూర్తి చేసుకున్న సచిన్ సోమవారం 50వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. కాగా క్రికెట్ దేవుడుగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 2014ఫిబ్రవరి 04న అందుకున్నాడు.