బెర్లిన్: జర్మనీ మేగజైన్ పత్రిక డెర్ స్పైగెల్ భారతదేశాన్ని గెలిచేస్తూ కార్టూన్‌ను ప్రచురించింది. దీని పట్ల భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ప్రపంచంలో భారతదేశం అతి పెద్ద జనాభా దేశంగా అవతరించి, ఈ విషయంలో చైనాను అధిగమించిన విషయాన్ని తీసుకుని వెలువరించిన ఈ కార్టూన్ పూర్తి స్థాయిలో జాత్యాహంకార వ్యక్తీకరణగా ఉందని నిరసనలు వ్యక్తం అయ్యాయి.
Also Read: భారతీయ విద్యార్థులకు పదిలక్షల అమెరికా వీసాలు
ఓ వైపు భారతీయులు కిక్కిరిసిన రీతిలో ఓ రైలుపై కూడా ఎక్కి చేతులలో త్రివర్ణ జెండాను పట్టుకుని ఉండటం, పక్కనే చైనా బుల్లెట్ ట్రైన్ పక్కన ఉన్న పట్టాలపై వెనుకబడ ఉండటం కార్టూన్‌లో చిత్రీకరించారు. సంబంధిత కార్టూన్‌పై భారత సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ సీనియర్ సలహాదారు కాంచన్ గుప్తా స్పందించారు. జర్మనీ నీకిది తగదు, పూర్తిగా రేసిస్టు ధోరణితో గీతలకు దిగుతారా? భారతదేశం వెనుకబడి ఉందని చెప్పడం, చైనాకు డబ్డా కొట్టడంగా ఉందని వ్యాఖ్యానించారు. భారతదేశం అంగారకుడి యాత్రకు కూడా సిద్ధం అవుతోందని తెలుసా? అని ప్రశ్నించారు.