Friday, November 15, 2024

అమెరికా విమానంలో మంటలు…ఓహియోలో అత్యవసర ల్యాండింగ్!

- Advertisement -
- Advertisement -
ఆకాశంలో పక్షిని ఢీకొట్టడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దాంతో అత్యవసరంగా విమానాన్ని దించేశారు.

ఓహియో: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఆదివారం ఓహియో విమానాశ్రయంలో పక్షిని ఢీకొట్టిన తర్వాత దాని ఇంజిన్ గాలిలో మంటలంటుకుంది. వెంటనే సురక్షితంగా, అత్యవసరంగా దాన్ని దించేశారు. ‘ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, విమానం జాన్ గ్లెన్ కొలంబస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది’ అని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ‘సిబిఎస్ న్యూస్’కు ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

ట్రాకింగ్ సైట్ ‘ఫ్లయిట్ అవేర్’ ప్రకారం, విమానం బోయింగ్ 737 కమర్షియల్ జెట్ ఆదివారం ఉదయం 7.45కి టేకాఫ్ చేసింది. కానీ తర్వాత 30 నిమిషాలకు విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఆ విమానం ఫీనిక్స్ స్కై హార్బర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెళుతుండగా, అప్పర్ ఆర్లింగ్టన్ మీద ప్రయాణిస్తుండగా విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్టింది. దాంతో విమానాన్ని మళ్లించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News