Sunday, December 22, 2024

నేనైతే బిజెపి జీరో కావాలని కోరుకుంటున్నాను: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. నితీశ్ కుమార్ వెంట ఉపముఖ్య మంత్రి తేజస్వీ యాదవ్ కూడా వెళ్ళారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఐక్య ప్రతిపక్ష కూటమిని ఏర్పాటుచేయడం ఎలా అనే దానిపై వారు చర్చించారు.సమావేశానంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తమ చర్చలు పాజిటివ్‌గా ముగిశాయని తెలిపారు. ‘మేము రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న దానిపై చర్చించాము. ఇప్పుడు అధికారంలో ఉన్న వారికి దీంతో సంబంధం లేదు. వారు వారి ప్రచారం చేసుకుంటున్నారు. దేశ అభివృద్ధికి వారేమి చేయడంలేదు’ అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు.

మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘నేను నితీశ్ కుమార్‌కు కేవలం ఒకే ఒక్క వినతి చేశాను. జయప్రకాశ్‌జీ తన ఉద్యమాన్ని బీహార్ నుంచే మొదలెట్టారు. ఒకవేళ మేము బీహార్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించితే, తదుపరి ఏమి చేయాలన్నది ఆలోచిస్తాం. కానీ దానికి ముందు మేము ఐక్యంగా ఉన్నామన్న సందేశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నాకెలాంటి అభ్యంతరాలు లేవని నేను ఇదివరకే చెప్పాను. బిజెపి జీరో కావలని నేను కోరుకుంటున్నాను. వారు మీడియా మద్దతుతో, అబద్ధాలతో పెద్ద హీరోలైపోయారు’ అన్నారు. ‘మేము ముందుకెళతాం. మాకెలాంటి అహంభావితనం లేదు. మేమంతా సమిష్టిగా కలిసి పనిచేయాలనుకుంటున్నాం’ అని కూడా ఆమె చెప్పారు.

నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ నేడు సాయంత్రం 5.00 గంటలకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో కూడా భేటీ కానున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్షాల ఐక్యతను రూపొందించడానికే వారు భేటీ కానున్నారని సమాచారం.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఢిల్లీలో నితీశ్ కుమార్ సమావేశం అయిన కొన్ని రోజులకు ఆయన మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. సమావేశానంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘మేము వీలయినంత ఎక్కువ పార్టీలను కలుపుకుని ఐక్యతన సాధిస్తాం. ఆ తర్వాతే ముందుకు కదులుతాం’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News