Monday, December 23, 2024

మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిట్ ఆఫీస్‌కు తాను వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వైఎస్‌ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిలా తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి దర్యాప్తుపై సిట్ అధికారికి వినతి పత్రం ఇవ్వాలనుకున్నామని, కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు మా అనుమానాలను అధికారికి చెప్పడం తన బాధ్యత అని అన్నారు. సిట్ ఆఫీస్‌కు వెళ్లడానికి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాను ధర్నాకు పోలేదని, ముట్టడి అని పిలుపు ఇవ్వలేదని, మరి తనని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని షర్మిల ప్రశ్నించారు. తానేమైనా క్రిమినల్‌నా? లేక హంతకురాలినా? అని అడిగారు.

Also Read: లలితా జువెల్లరీలో అమ్మకాలకు విశేష స్పందన..

తనకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? అని షర్మిల నిలదీశారు. తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, తాను వెళ్తుంటే మీద పడి అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేశారని అడిగారు. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం తన బాధ్యత అని తెలిపారు. ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడంతో ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News