Saturday, December 21, 2024

రాహుల్ గాంధీకి పాట్నా హైకోర్టు ఉపశమనం!

- Advertisement -
- Advertisement -
రాహుల్ గాంధీ ఏప్రిల్ 22న పాట్నా హైకోర్టును ఆశ్రయించి, పరువునష్టం కేసులో కింది కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టేయాలని అభ్యర్థించారు.

పాట్నా: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెట్టుకున్న అభ్యర్థనపై పాట్నా హైకోర్టు సోమవారం ఉపశమనం కల్పించింది. ‘మోడీ ఇంటిపేరు’ పరువునష్టం కేసులో మే 15 వరకు కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వుపై ‘స్టే’ ఇచ్చింది. దీనికి ముందు పాట్నాకు చెందిన కింది కోర్టు ఏప్రిల్ 12న తన ముందు హాజరు కావాలని ఆదేశించింది. 2019లో ‘మోడీ ఇంటిపేరు’పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ, రాహుల్ గాంధీపై పిటిషన్ దాఖలు చేశారు. కాగా రాహుల్ గాంధీ ఏప్రిల్ 22న పాట్నా హైకోర్టును ఆశ్రయించి, కింది కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టేయాలని వినతి చేశారు.

‘మేము పిటిషన్‌ని కొట్టేస్తున్నాము. సూరత్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఇదే విషయంలో మళ్లీ వేరే కోర్టులో విచారణ కుదరదు. ఇది అన్యాయం. తదుపరి విచారణ మే 15న. కింది కోర్టుల్లో ఉన్న అన్ని ప్రొసీడింగ్స్‌పై స్టే విధిస్తున్నాం’ అని కోర్టు పేర్కొన్నట్లు రాహుల్ గాంధీ తరఫు అడ్వొకేట్ వీరేంద్ర రాథోడ్ ఎఎన్‌ఐ వార్తా సంస్థకు తెలిపారు. కాగా సుశీల్ మోడీ తరఫు న్యాయవాది మాత్రం కోర్టు ‘ఈ విషయంలో వాదనలు కొనసాగించమని కోరింది’ అన్నారు.

సూరత్ కోర్టు ఇప్పటికే రాహుల్ గాంధీని దోషిగా తేల్చి శిక్ష విధించింది. దాంతో ఆయన లోక్‌సభ సభ్యత్వంపై కూడా అనర్హత వేటు పడింది. ప్రొటోకాల్ ప్రకారం రాహుల్ గాంధీ ప్రభుత్వం తనకు కేటాయించిన అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తన తల్లి సోనియా గాంధీ ఇంటిలో ఉంటున్నారు. ‘నిజం మాట్లాడినందుకు తాను మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News