Friday, December 20, 2024

పెళ్లి మండపంలో వరుడిపై మాజీ ప్రేయసి యాసిడ్ దాడి

- Advertisement -
- Advertisement -

బస్తర్: తనని కాదని వేరే మహిళను పెళ్లి చేసుకుంటున్న తన మాజీ ప్రయుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఒక 22 ఏళ్ల యువతి పెళ్లి మండపంలోనే యాసిడ్‌తో దాడి జరిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. యాసిడ్ దాడికి పాల్పడిన యువతిని ఆదివారం అరెస్టు చేసినట్లు బస్తర్ ఎస్‌పి నివేదితా పాల్ తెలిపారు.

Also Read: విమానం కాక్‌పిట్‌లో పైలట్ గర్ల్‌ఫ్రెండ్: డిజిసిఎ దర్యాప్తు

భన్‌పురి పోలీసు స్టేషన్ పరిధిలోని చోటే అబమల్ గ్రామంలో ఏప్రిల్ 19న ఒక 19 ఏళ్ల యువితిని పెళ్లి చేసుకుంటున్న దామోదర్ బఘెల్(25)పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో వరుడితోపాటు 10 మంది బంధువులు గాయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి జరిపినట్లు తొలుత కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో మాజీ ప్రేయసి గురించి తెలిసింది. దీంతో ఆమె పాత్రపై దర్యాప్తు జరిపి ఆమెను అరెస్టు చేసినట్లు ఎఎస్‌పి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News