Saturday, December 21, 2024

నారాయణగూడ ఇన్స్‌స్పెక్టర్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ,హైదరాబాద్: విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించిన నారాయణగూడ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో యథేచ్చగా హుక్కా పార్లర్లు నడుస్తుండడంపై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. హుక్కా సెంటర్లపై ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్న నారాయణగూడ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెన్షన్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News