- Advertisement -
న్యూఢిల్లీ : మాజీ ఐపిఎల్ కమిషనర్ లలిత్‌మోడీకి వ్యతిరేకంగా దాఖలైన కోర్టు ధిక్కారం కేసు విచారణను సోమవారం సుప్రీం కోర్టు ఎత్తివేసింది. న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు లలిత్‌మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణను ఉపసంహరించుకుంది.
జస్టిస్ లు ఎంఆర్ షా, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం మోడీ దాఖలు చేసిన అపిడవిట్‌ను పరిశీలించింది. అందులో లలిత్ మోడీ తాను భవిష్యత్తులో న్యాయస్థానాల లేదా భారత న్యాయవ్యవస్థ ఘనత, గౌరవానికి విరుద్ధంగా ఏ విధంగా ఏదీ చేయబోనని పేర్కొన్నారు. దీంతో విశాల హృదయంతో తాము లలిత్‌మోడీ బేషరతు క్షమాపణను అంగీకరిస్తునామని, దీంతో ఈ విచారణను ముగుస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.
- Advertisement -