Monday, December 23, 2024

మందుబాబులు బీభత్సం… పోలీసులను కారుతో ఢీకొట్టి…

- Advertisement -
- Advertisement -

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మందుబాబులు బీభత్సం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా పోలీసులను మందు బాబులు కారుతో ఢీకొట్టారు. కానిస్టేబుల్ లింగారెడ్డిని మందుబాబులు కొంతదూరం ఈడ్చుకెళ్లారు. కానిస్టేబుల్ లింగారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మద్యం ప్రియులు రోడ్లపై నానా హంగామా సృష్టిస్తున్నారు. రోడ్డున వెళ్లేవారితో గొడవలకు దిగుతున్నారు. మద్యం షాపుల ముందు నుంచి మహిళలు, చిన్నారులు వెళ్లాలంటేనే వెన్నులో వణుకుపుడుతోందని వాపోతున్నారు.

Also Read: ప్రియురాలిని చంపి… 12 కిలో మీటర్ల దూరంలో పడేశారు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News