Friday, November 22, 2024

పిఎంఒ కోసం నకిలీ విజిటింగ్ కార్డులు: గుజరాతీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

శ్రీనగర్: ఒక గుజరాతీ మోసగాడి కోసం విజిటింగ్ కార్డులు తయారుచేస్తున్న ఒక వ్యక్తిని కశ్మీరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల ప్రింటింగ్ ప్రెస్‌కు పియుష్ భాయ్‌ను కశ్మీరు పోలీసులు అరెస్టు చేశారు.
ప్రధానమంత్రి కార్యాలయంలో(పిఎంఓ) అదనపు డైరెక్టర్(వ్యూహాం, ప్రచారాలు)గా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న కిరణ్ పటేల్ అనే మోసగాడి కోసం విజిటింగ్ కార్డులు తయారుచేస్తున్న భాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగాన్ని బురిడీ కొటించి కశ్మీరులో వివిఐపి ప్రొటోకాల్, భద్రతను పొందిన కిరణ్ పటేల్‌ను మార్చి 16న శ్రీనగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ కశ్మీరులోని బడ్‌గాం జిల్లాలోని దూద్‌పత్రితోసహా కశ్మీరులో అనేక ప్రదేశాలను కిరణ్ పటేల్ సందర్శించినట్లు తెలుస్తోంది. దూద్‌పత్రి వద్ద అతని వెంట సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ర్యాంక్ అధికారి ప్రొటోకాల్‌లో భాగంగా ఉండగా ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు సైతం కశ్మీరులో అతని వెంట ఉన్నారు.

Also Read: తూర్పు లడఖ్‌లో పరస్పర ఆమోద తీర్మానానికి చైనా అంగీకారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News