Monday, December 23, 2024

చంద్రబాబు చీకటికి ప్రతినిధి: సజ్జల

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వంలో బిసిలకు నిజమైన న్యాయం జరిగిందని మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశామని, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చదువుకున్న స్కూల్‌నే పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో జరిగేదంతా నీచ రాజకీయమేనని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లు కట్టించలేక పునాదుల దశలోనే చంద్రబాబు వదిలేసిన ఘనుడు అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక టిడోక్క ఇళ్లను పూర్తి చేశామన్నారు.

Also Read: దాడులు చేసి కేసులు పెడతారా: పవన్‌కళ్యాణ్

తాము కట్టిన ఇళ్ల దగ్గర సెల్ఫీలు తీసుకొని తమకే సవాల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. లోకేష్‌కు మాత్రం ఏం పీకుతున్నారనే మాట తప్ప మరేమీ నేర్పలేదోమో అని సజ్జల వ్యంగ్యస్త్రాలు సంధించారు. లోకేష్ నోరు తెరిస్తే ఈ పీకుడు భాషే మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు మీడియా బలం తప్పితే మరేమీలేదని విమర్శించారు. చంద్రబాబు చీకటికి ప్రతినిధి… జగన్ వెలుగులకు ప్రతినిధి అని అన్నారు. నాయీ బ్రహ్మణులకు చట్ట సభల్లో అవకాశం దక్కుతుందన్నారు. టిడిపిని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని సజ్జల పిలుపునిచ్చారు. 175కి 175 సీట్లు కొట్టడమే లక్షంగా తాము ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News