Monday, December 23, 2024

స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం కొంత మూమెంటం కనిపించింది. బ్యాంకులు- ఫైనాన్స్ స్టాకులు, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ కాస్త పుంజుకున్నాయి. సెన్సెక్స్ 74.61 పాయింట్లు లాభపడి 60130.71 వద్ద, నిఫ్టీ 25.85 పాయింట్లు లాభపడి 17769.25 వద్ద ముగిశాయి. నిఫ్టీలోని 15 రంగాల సూచీలలో ఎనిమిది లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ 15 నిమిషాల ఛార్ట్‌లో 17810కి పైన ముగిస్తే ఇంట్రాడే ట్రేడర్లు ‘లాంగ్’ అవకాశాలకు ఎదురు చూడొచ్చు. అదే 17600 లెవల్ కిందికి వస్తే ‘షార్ట్’ అవకాశాలకు ఎదురుచూడొచ్చు.

నేడు బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బ్రిటానియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభపడగా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, యుపిఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ నష్టపోయాయి. చైనా స్టాకులు వరుసగా ఐదో రోజున కూడా నష్టపోయాయి. దాదాపు నెల కనిష్ఠాన్ని తాకాయి. యూరొపియన్ షేర్లు కూడా నష్టపోయాయి. అమెరికా డాలరుతో రూపాయి విలువ ఎలాంటి మార్పు లేకుండా రూ. 81.92 వద్ద ముగిసింది. ఇక 24 క్యారెట్ల (నిక్కార్సయిన) బంగారం 10 గ్రాములు రూ. 169.00 నష్టపోయి 59832.00 వద్ద ట్రేడయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News