Thursday, April 10, 2025

ప్రభుత్వం ‘లా అండ్ ఆర్డర్’ అమలులో విఫలం: వర్ల రామయ్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రామయ్య మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థను సిఎం జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కొంతమంది పోలీసు అధికారులు తమ విధులను విస్మరిస్తున్నారని ఆయన తెలిపారు.

రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాజీ ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు చేసి నిరసనలు తెలుపుతూ బహిరంగంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని రామయ్య విమర్శించారు. మంత్రి సురేష్ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం సిగ్గుచేటని వర్ల రామయ్య పేర్కన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News