ఈ ఫ్యాక్టరీలో ఈ ప్రాంతానికి చెందిన 800 నుంచి 1000 మందికి ఉపాధి
హైదరాబాద్: జహీరాబాద్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వాహన తయారీ ఫ్యాక్టరీలో శంకుస్థాపన సందర్భంగా తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి. రామారావు ఎలక్ట్రిక్ ఆటో నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆటో నడిపిన అనుభవాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘త్రిచక్ర వాహనాన్ని నడిపి ఎంజాయ్ చేశాను’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ స్థానిక వాతావరణానికి అనుకూలమైనది, ఇక్కడి వారికి ఉపాధిని కూడా కల్పిస్తుంది. అవసరమైతే ఓ స్కిల్లింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉద్యోగ కల్పనలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. కంపెనీ విస్తరణలో భాగంగానే జహీరాబాద్‌లో ఫ్యాక్టరీ వస్తోందన్నారు. జహీరాబాద్‌లో ఓజెఎ ట్రాక్టర్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఎం అండ్ ఎం కంపెనీ తెలిపింది.
Enjoyed my ride in the Treo today @anandmahindra Ji 😁 https://t.co/fE50pl1SUX
— KTR (@KTRBRS) April 24, 2023
A momentous day for us in our journey @MahindraLMM as @KTRBRS did the ground breaking of our new EV manufacturing line at Zaheerabad… we are so grateful that he took the time to visit our facility and grace the occasion 🙏 pic.twitter.com/hr6NYeU6Nx
— Suman Mishra (@sumanmishra_1) April 24, 2023