Monday, December 23, 2024

’తెలంగాణ రత్న’ అవార్డును అందుకున్న ఖమ్మం కళాకారుడు యర్రా రమేష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం: ఆంధ్రపద్రేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య వారిచే వివిధ రంగాలవారికి అందిస్తున్న ’తెలంగాణ రత్న’ అవార్డును ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ రంగస్థల నటులు, మిమిక్రీ కళాకారులు యర్రా రమేష్‌కు ప్రధానం చేసారు. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో వీరికి అవార్డును ముఖ్యఅతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ చేతుల మీదుగా ప్రధానం చేసారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ యర్రా రమేష్ చక్కని నటుడిగా నాటకం, మిమిక్రీ వంటి కళల్లో నిష్ణాతుడిగా రాష్ట్రస్తాయిలో పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఎంతో మందిని ఉత్తమ కళాకారులుగా కూడా తీర్చిదిద్దారన్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగాయన్నారు. కళాకారులను ప్రోత్సహించే వారిని ఇతోదికంగా సన్మానించుకోవడం అదృష్టమన్నారు. గతంలో ఇదే వేదికపై హెల్త్ కేర్ ఇంటర్నేషనల్‌వారిచే అబ్దుల్ కలాం సేవా అవార్డును తీసుకున్నారని, ఎక్స్ రే సంస్థ విజయవాడ వారిచే ఎన్టీఆర్ అవార్డును కూడా అందుకున్నారని తెలిపారు. నాటక పోటీల్లో కొత్తవారిని ఎంకరేజ్ చేసే పరుచూరి రఘుబాబు స్మారక మెమోరియల్ వారిచే ప్రతిభా అవార్డును కూడా తీసుకోవడం అభినందనీయమన్నారు.

అఖిల భారత సంస్కృతిక సమాఖ్య వ్యవస్తాపక జాతీయ కార్యదర్శి డాక్టర్ గణగళ్ల విజయ్‌కుమార్ మాట్లాడుతూ తెలుగు సాంస్కృతిక మహోత్సవం-2023లో భాగంగా తమ సంస్త 23వ వార్షికోత్సవంలో వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారిని హైదరాబాద్‌కు ఆహ్వానించి అవార్డు ప్రదానం చేసి ఘనంగా సన్మానిస్తున్నామన్నారు. అవార్డు కింద రమేష్‌కు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News