Monday, December 23, 2024

సువర్ణాంధ్ర దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచన చేయాలి : మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/సూర్యాపేట : సువర్ణాంధ్ర దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచన చేయాలి. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆలోచించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రంలో పాలకులు అనుసరిస్తున్న విధానాల మూలంగా రాయల తెలంగాణ అంశం తెరమీదకు వచ్చిన అంశం పై స్పందిస్తూ రాయల సీమతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాయల తెలంగాణ కోరడమంటే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతున్న తీరే దీనికి కారణమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కలపండి అంటూ రాయల తెలంగాణ ప్రాంత వాసులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర సరిహద్దు ప్రాంతాల నుండి పలు గ్రామాల ప్రజలు కోరుతున్న విషయం తెలిసిందే అన్నారు. తెలంగాణ పాలకులు చిత్తశుద్ధితోచేసిన అభివృద్ధితోనే ఇతర ప్రాంతాల ప్రజలు కేసీఆర్ పాలనలో ఉండాలని కోరుకుంటున్నారని గుర్తు చేశారు.

స్వర్ణాంధ్రగా మార్చండి అని కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్న విషయం తెలిసిందే అన్నారు. పాలకుల తీరుతో వెనుకబాటుకు గురైన ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని, అందులో భాగంగా భారాసను బలోపేతం చేయడమే ఏకైక మార్గమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, భారాస రాష్త్ర కార్యదర్శి ఎలగందుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News