Monday, December 23, 2024

తిరుమల కొండపై హెలికాప్టర్ చక్కర్లు!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తిరుమల కొండపై హెలికాప్టర్లు చెక్కర్లు కొట్టాయి. నో ఫ్లై జోన్ నుంచి మూడు హెలికాప్టర్లు వెళ్లాయి.మంగళవారం మధ్యాహ్నం ఈ హెలికాప్టర్లు కనిపించాయి. తిరుమల నో ఫ్లయింగ్ జోన్ అనే విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో విమానాలు , హెలికాప్టర్లు ,డ్రోన్లు ఎగురకూడదనే నిబంధన అమల్లో ఉంది. నిషేధిత ప్రాంతంలో హెలికాప్టర్లు ప్రయాణించటం కలకలం రేపింది. అయితే ఇవి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందినవిగా సమాచారం. కడప నుంచి చెన్నై వెళుతున్న సమయంలో ఇవి తిరుమల కొండమీదనుంచి ప్రయాణించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ధృవీకరించాల్సివుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News