- Advertisement -
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ‘మన’ గ్రామం భారతదేశ తొలిగ్రామంగా రోడ్స్ ఆర్గనైజేషన్ సైన్‌బోర్డు ఏర్పాటు చేసింది. ‘మన’ గ్రామం వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) ఉంటుంది. ఈనేపథ్యంలో ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్‌సింగ్ ధామి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ ఇకనుంచి ‘మన’ దేశం చివరిగ్రామం కాదని తొలి గ్రామం అన్నారు. తమ ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాలు కూడా చేసేందుకు కృషి చేస్తోందన్నారు. ‘మన’ గ్రామం ప్రముఖ పుణ్యక్షేత్రం బదరీనాథ్ సమీపంలో ఉంది. కాగా గతేడాది అక్టోబర్‌లో చమోలి గ్రామాన్ని సందర్శించిన ప్రధాని మోడీ దేశ సరిహద్దులో ఉన్న గ్రామాలు చివరి గ్రామాలు కాదని దేశ తొలి గ్రామాలుగా పేర్కొన్నారు.
- Advertisement -