హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ముందు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గాంధీ దవాఖాన ఎదుట చిరంజీవి అనే వ్యక్తి కుటుంబీకులు ధర్నాకు దిగారు. సైదాబాద్ సింగరేణి కాలనీ వాసి చిరంజీవి అనుమానాస్పదంగా మృతిచెందాడు. తుకారం గేట్ పోలీసుల అదుపులో ఉన్న చిరంజీవి హఠాన్మరణం చెందాడు. చిరింజీవిని చోరీ కేసులో అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. చిరంజీవిని ప్రశ్నిస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడని పోలీసులు వెల్లడించారు. చిరంజీవిని పోలీసులే కొట్టిచంపారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
Also Read: అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు హైదరాబాదీ విద్యార్థుల మృతి
బైక్ దొంగతనం కేసులో ఎల్‌బినగర్‌కు చెందిన పాత నేరస్థుడు చిరంజీవిని తూకారం గేట్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు పిలిపించారు. పోలీసులు ఇంటరాగేషన్‌లో చిరంజీవి అస్వస్థతకు గురికావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిరంజీవి మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రి ఎదుట బాధితుడి బంధువులు రోడ్డుపై భైఠాయించారు. బాధితుల ఆందోళనతో గాంధీ ఆస్పత్రి ముందు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.